ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ

ABN, First Publish Date - 2021-11-29T06:34:37+05:30

కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో శ్రీసంతోషి రూపాదేవి సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో 19వ కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు.

ఆత్మకూరు(ఎస్‌) మండలం పాత సూర్యాపేటలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

ఆత్మకూర్‌(ఎస్‌), నవంబరు 28:   కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పాత సూర్యాపేట గ్రామంలో శ్రీసంతోషి రూపాదేవి సేవా సమితి ట్రస్టు ఆధ్వర్యంలో 19వ కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని  ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా శివనామ స్మరణతో ప్రాంగణం మార్మోగింది.  108 శివ లింగాలతో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగాలకు భక్తులు  క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో మంత్రి జగదీష్‌రెడ్డి,  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి డి.రవీంద్రగుప్తా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడారు. కార్తీక వన సమారాధనలో ప్రజలు  పాల్గొనా లని ఆయన కోరారు. ఈ  కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌,  నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, పెరుమాళ్ల అన్నపూర్ణ, మీలా మహదేవ్‌, నూక వెంకటేశగుప్తా, బ్రహ్మండపల్లి మురళీదర్‌, నరేందర్‌, విద్యాసాగర్‌రావు, అలివేలు, మంగమ్మ, గుండా రమేష్‌, విజయ్‌కుమార్‌, కొణతం సత్యనారాయణరెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, డి.రవీందర్‌ పాల్గొన్నారు.

వన భోజనాలు ఎంతో ప్రత్యేకం: మంత్రి

చివ్వెంల: కార్తీక మాసంలో వన భోజనాలు ఎంతో ప్రత్యేకమైనవని    మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయ సమీపంలోని వివేకా నంద వృద్ధాశ్రమంలో కిరాణ, ఫ్యాన్సీ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాసం వన భోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్షు డిగా ఎన్నికైన సవరాల సత్యనారాయణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉప్పుల లలిత, బొమ్మిడి లక్ష్మీనారాయణ, గండూరి కృపాకర్‌, పావని పాల్గొన్నారు. 

పేదవారికి కమ్మ సంఘం అండగా ఉండాలి

హుజూర్‌నగర్‌  రూరల్‌: కులంలోని పేదవారికి విద్య, వైద్యం లో కమ్మ సంఘం అండగా నిలబడాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్‌ శివప్రసాద్‌చౌదరి, కోట సూర్యప్రకాశ్‌రావు కోరారు. స్థానిక లక్కవరం రోడ్డులోని మామిడితోటలో ఆదివారం నిర్వహించిన  కాకతీయ కమ్మ వన భోజన మహోత్సవంలో వారు మాట్లాడారు. కమ్మ కులస్థుల అభ్యున్నతికి ప్రభుత్వాలు తోడ్పాటునందించారు.  అనంతరం ఉసిరి చెట్టుకు పూజలు చేశా రు. ఈ సందర్భంతో చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కేఎల్‌ఎన్‌రావు, అట్లూరి మంజుల,  రావూరి రూపశివప్ర సాద్‌, అట్లూరి హరిబాబు, శాఖమూరి విజయలక్ష్మి, రవి, కోటేశ్వరరావు, సావిత్రి, పద్మ హరిప్రసాద్‌, దొడ్డా నర్సింహారావు, అశోక్‌, బాలకృష్ణ, మట్టపల్లిరావు, సురేష్‌ పాల్గొన్నారు. 

సామాజిక సేవలో కమ్మ సంఘం సభ్యులు ముందుండాలి: ఎంపీపీ

అనంతగిరి: సామాజిక సేవలో కమ్మం సంఘం సభ్యులు ముందుండాలని అనంతగిరి ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర రావు అన్నారు. మండ లంలోని  వాయిలసింగారం గ్రామంలో జరిగిన కమ్మ వనభోజన మహోత్సవంలో ఆయన మాట్లాడారు. కమ్మ కులస్థులు విద్య, రాజకీయ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో గింపుజల్లి రమేష్‌, జొన్నలగడ్డ శ్రీనివాస్‌రావు, రఘు, గద్దే రఘు, సతీష్‌, యశ్వంత్‌, మోహన్‌రావు, కొల్లు సుబ్బారావు, సాంబశివరావు, మురళీ పాల్గొన్నారు. 

మున్నూరు కాపులు సంఘటితం కావాలి

తుంగతుర్తి: సమస్యల పరిష్కారానికి మున్నూరు కాపులు సంఘటితం కావలని ఆసంఘం రాష్ట్ర కోఆర్డినేటర్‌ సర్దార్‌ పుటం పురుషోత్తంరావు  అన్నారు. తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మున్నూరు కాపు కులస్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  కోదాడలో  మున్నూరుకాపు, సర్వబ్రాహ్మణ వనమహోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ పాల్గొన్నారు. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కోఆర్డినేటర్‌ పసునూరి శ్రీనివాస్‌, తోట శ్రవణ్‌, గాజుల మహేందర్‌, ఎడ్ల అమరేందర్‌, జానయ్య, మూరగుండ్ల సోమయ్య, లింగయ్య పాల్గొన్నారు.





 కోదాడలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

Updated Date - 2021-11-29T06:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising