ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎస్‌ఎల్‌బీసీ, పెండ్లిపాకల’ సర్వే పనులు షురూ

ABN, First Publish Date - 2021-08-04T06:22:24+05:30

ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌ కెనాల్‌, పెండ్లిపాకల రిజర్వాయర్‌ ఎత్తుపెంపు కారణంగా ముంపునకు గురవుతున్న కొండమల్లేపల్లి మండలం గుడితండాలో సమగ్రసర్వే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.

గుడితండాలో ముంపు బాధితులతో మాట్లాడుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముంపు బాధితులు అధికారులకు సహకరించాలి

 భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ జగన్నాథరావు 

దేవరకొండ, ఆగస్టు 3: ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌ కెనాల్‌, పెండ్లిపాకల రిజర్వాయర్‌ ఎత్తుపెంపు కారణంగా ముంపునకు గురవుతున్న కొండమల్లేపల్లి మండలం గుడితండాలో సమగ్రసర్వే పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ జగన్నాథరావు, దేవరకొండ ఆర్డీవో గోపిరాం, అధికారులు సర్వే పనులను ప్రారంభించారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నాలుగుతండాల బాధితులందరికీ పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి పరిహారం అందిస్తామని సర్వే అధికారులకు సహకరించాలని స్పెషల్‌ కలెక్టర్‌ జగన్నాథరావు కోరారు. మొదటగా గుడితండాలో సర్వే నిర్వహించిన అనంతరం మరో మూడు తండాల్లో సర్వే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కొండమల్లేపల్లి తహసీల్దార్‌ సరస్వతి, నీటిపారుదలశాఖ డీఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

నర్సిరెడ్డిగూడెంలో ఇంటింటి సర్వే 

మర్రిగూడ :  చర్లగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నర్సిరెడ్డిగూడెం గ్రామంలో రెవెన్యూ అధికారులు, ఎంపీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి సర్వే నిర్వహించారు.  గతంలో నిర్వహించిన సర్వేలో కొంతమంది బాధితులు సర్వే రికార్డుల్లో తమ పేర్లులేవంటూ దరఖాస్తులు చేసుకోగా తహసీ ల్దార్‌ దేశ్యానాయక్‌, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, ఆగ్రామ సర్పం చ్‌ చిట్యాల సబిత యాదగిరిరెడ్డి కలిసి దరఖాస్తులు చేసుకున్న 13 మంది బాధితుల ఇళ్లను సర్వే చేశారు. బాధితుల పిర్యాదు మేరకు ఇళ్లను పరిశీలించి అందులో కొంతమందిని మాత్రమే పునరావాసం కోసం అర్హులుగా గుర్తించినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ బుచ్చాలు, రెవెన్యూ సిబ్బంది అమీర్‌, ఆర్‌ఐ బషీర్‌, సత్తయ్య ఉన్నారు.  

Updated Date - 2021-08-04T06:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising