ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునరావాసం కల్పించాలి

ABN, First Publish Date - 2021-06-12T06:12:47+05:30

పునరావాసంతోపాటు పరిహారం చెల్లించాలని శివన్నగూడ రిజర్వాయర్‌ పనులను భూనిర్వాసితులు శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం బాధితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆ ర్‌ ప్యాకేజీ, పరిహారం చెల్లించకుండా రిజర్వాయర్‌ పనులుచేస్తున్నారన్నారు.

శివన్నగూడ రిజర్వాయర్‌ పనులను అడ్డుకుంటున్న నర్సిరెడ్డిగూడెం భూనిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివన్నగూడ పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు 


మర్రిగూడ, జూన్‌ 11: పునరావాసంతోపాటు పరిహారం చెల్లించాలని శివన్నగూడ రిజర్వాయర్‌ పనులను భూనిర్వాసితులు శుక్రవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం బాధితులకు పునరావాసం, ఆర్‌అండ్‌ఆ ర్‌ ప్యాకేజీ, పరిహారం చెల్లించకుండా రిజర్వాయర్‌ పనులుచేస్తున్నారన్నారు. పోలీసుల పహారాతో పనులు కొనసాగించడం తగదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగుల్‌మీ రా అక్కడికి చేరుకొని నిర్వాసితులకు నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక యంత్రాలు వెళ్లిపోగా బాధితులు ఆందోళన విరమించారు. కాగా, ముంపునకుగురైన లావుణి పట్టాదారులకు పరిహారం చెక్కులను స్థానిక తహస్దీర్‌ కార్యాలయంలో డీటీ తారకరామన్‌ శుక్రవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందుర్తి రెవెన్యూ పరిధిలోని లావుణి పట్టాదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.


పరిహారం చెల్లించాకే భూములు తీసుకోవాలి

చింతపల్లి: మండల కేంద్రంలోని సర్వేనెంబర్‌ 154లో ఉన్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించాకే స్వాధీనం చేసుకోవాలని బాధిత రైతులు డిమాండ్‌ చేశారు. రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న ప్రజల కోసం తమ భూములు తీసుకోవడం అన్యాయమన్నారు. ఎకరానికి రూ.20లక్షలు, 300 గజాల ప్లాట్‌, ఇంటికో ఉద్యోగం ఇచ్చాకే తమ భూములు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారి ఆందోళనకు సర్పంచ్‌ ముచ్చర్ల యాదగిరి, కాంగ్రెస్‌ నేతలు కాసారపు శ్రీనివాస్‌, ఎండి.రియాజ్‌, ఎల్లంకి రాధకిషన్‌ తదితరులు మద్దతు పలికారు.

Updated Date - 2021-06-12T06:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising