ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 మెట్రిక్‌ టన్నుల బైరటీస్‌ పట్టివేత

ABN, First Publish Date - 2021-12-08T06:49:51+05:30

మండల పరిధిలోని మొగలాయికోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 50మెట్రిక్‌ టన్నుల బైరటీస్‌ ఖనిజాన్ని ప్రాంతీయ నిఘా అధికారులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు.

మొగలాయికోటలో తనిఖీలు చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతగిరి, డిసెంబరు 7: మండల పరిధిలోని మొగలాయికోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 50మెట్రిక్‌ టన్నుల బైరటీస్‌ ఖనిజాన్ని ప్రాంతీయ నిఘా అధికారులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. ఉమ్మడి నల్లగొండ నిఘా అధికారి డి.శ్రీనివాసరావు, డీఎస్పీ కమలాకర్‌ ఆదేశాల మేరకు గనుల, భూగర్భశాఖ జిల్లా సహాయ సంచాలకుడు కె.రాంబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. మొగలాయికోటకు చెందిన సింగిరెడ్డి వీరమ్మకు చెందిన పట్టాభూమి సర్వేనెంబర్‌ 62లో అక్రమంగా నిల్వచేసిన 10 ట్రాక్టర్ల బైరటీస్‌ ఖనిజాన్ని పట్టుకొని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఖమ్మం జిల్లా నుంచి ఈ ఖనిజాన్ని అక్రమంగా తరలించి అవసరమైన ప్రాంతాలకు చేరుస్తున్నట్టు నిఘా అధికారులు గుర్తించారు. ఖనిజం పన్ను విలువ రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఉంటుంది. ఈ దాడుల్లో సీఐ మహేష్‌, గనులశాఖ జిల్లా సహాయ సంచాలకుడు పి.కృష్ణంరాజు, ఆర్‌ఐ గిరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T06:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising