సెగ్రిగేషన్ షెడ్లు వెంటనే పూర్తి చేయాలి : రాహుల్‌శర్మ
ABN, First Publish Date - 2021-04-01T05:46:26+05:30
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సెగ్రిగేషన్ షెడ్లను ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని, పూర్తిచేసిన వాటిలో ఏప్రిల్ 20వ తేదీ లోపు కంపోస్టు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు.
నల్లగొండ, నల్లగొండ రూరల్, మార్చి 31 : జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సెగ్రిగేషన్ షెడ్లను ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని, పూర్తిచేసిన వాటిలో ఏప్రిల్ 20వ తేదీ లోపు కంపోస్టు తయారు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి ఎంపీడీవో, ఎంపీవో, ఏపీవో, ఈసీలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సెగ్రిగేషన్ షెడ్లు, నర్సరీల నిర్వహణ, లేబర్ టర్నవుట్, సర్వైవల్ క్యాప్చర్, పల్లె ప్రకృతి వనాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెగ్రిగేషన్ షెడ్ పూర్తైన ప్రతీ గ్రామపంచాయతీలో చెత్తను సెగ్రిగేట్ చేయాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో రేపటి నుంచి 100మంది కూలీలు ఉపాధి పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీల్లో సీడ్ సోయింగ్ పైమ్రరీ బెడ్లు పూర్తి చేయాలని, పల్లె ప్రకృతి వనాలకు వచ్చే వారంలోపు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డి, డీపీవో విష్ణువర్దన్‌రెడ్డి, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
===================
Updated Date - 2021-04-01T05:46:26+05:30 IST