ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమభావన సంఘాలకు రూ.100కోట్లు

ABN, First Publish Date - 2021-03-02T06:44:42+05:30

పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలకు కానుకగా సమభావన సంఘాలకు ఈ ఏడాది రూ.100కోట్ల రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు.

నల్లగొండలో మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డిని సన్మానించి ప్రసాదాన్ని అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

నల్లగొండ, యాదాద్రి రూరల్‌, మార్చి 1: పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలకు కానుకగా సమభావన సంఘాలకు ఈ ఏడాది రూ.100కోట్ల రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. పాలకవర్గ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం డీసీసీబీ కార్యాలయంలో కేక్‌ కట్‌చేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితో బ్యాంక్‌ అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. ఏడాదిలో బ్యాంక్‌ రూ.1500కోట్ల టోర్నవర్‌కు చేరిందన్నారు. ఈ ఏడాది రైతులకు రూ.500కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. అందులో రూ.180కోట్లు స్వలకాలిక, రూ.100కోట్లు దీర్ఘకాలిక, రూ.60కోట్లు బంగారంపై రుణాలు ఇచ్చామన్నారు. ఉద్యోగుల గృహనిర్మాణానికి రుణ పరిమితిని రూ.25లక్షల నుంచి రూ.40లక్షలకు పెంచామన్నారు. ఎన్‌పీఏను 6.55శాతం నుంచి 4శాతానికి తీసుకువచ్చామన్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో మెగా రుణమేళా ఏర్పాటు చేశామని తెలిపారు. సెలవు రోజుల్లో పనిచేసిన ఉద్యోగులందరికీ వేతనంగా రూ.3లక్షలు అదనంగా మంజూరు చేశామన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచామన్నారు. కాగా, వార్షికోత్సవం సందర్భంగా శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆయన నివాసంలో డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువ, పూలమాలతో సన్మానించి యాదాద్రీశుడి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట వైస్‌ చైర్మన్‌ ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి, డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, కుంభం శ్రీనివా్‌సరెడ్డి రంగాచారి, యాదగిరిగుట్ట పీఎసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మిడి రాంరెడ్డి, ఆలేరు పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశం, శ్రీనివా్‌సరెడ్డి, శ్రీకర్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-03-02T06:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising