ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యం పంపిణీ పారదర్శకంగా జరగాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-04-21T06:08:49+05:30

నేటి నుంచి ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి చేసే బియ్యం పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సూర్యాపేట కలెక్టరేట్‌,  ఏప్రిల్‌ 20 : నేటి నుంచి ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి చేసే బియ్యం పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరగాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 2,527 మంది ప్రైవేట్‌ టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను గుర్తించామన్నారు. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం 25 కిలోల చొప్పున రేషన్‌షాపులో(ఐరీష్‌, ఓటీపీ) ద్వారా పంపిణీ చేయడానికి 63.175 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అందు బాటులో ఉందన్నారు. ఈ నెల 25 వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. పంపిణీని నిత్యం పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.


Updated Date - 2021-04-21T06:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising