ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఎల్‌బీసీ తవ్వకం పనులు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2021-05-14T07:09:43+05:30

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్య ంతో ప్రారంభించిన శ్రీశైలం సొరంగమార్గం తవ్వకం పనులు పునః ప్రారంభమయ్యాయి.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, మే 13 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్య ంతో ప్రారంభించిన శ్రీశైలం సొరంగమార్గం తవ్వకం పనులు పునః ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బీడు భూములను సస్యశ్యామలం చేయాలని, ఫ్లోరైడ్‌ పీ డిత ప్రజలకు రక్షిత తాగునీటిని ఇవ్వాలన్న యోచనతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రూ.1,925 కోట్ల అంచ నా వ్యయంతో ఐదేళ్లలో పూర్తిచేసేలా నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2007 ఆగస్టులో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ఎడమ కాలువపై సుమారు 50కి.మీ మేర సొరంగం తవ్వి కృష్ణా నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు ఉద్ధేశం. ఈ సొరంగం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో బ్లాస్టింగ్‌కు అటవీశాఖ నిరాకరించింది. దీంతో సొరంగం పనులకు టన్నెల్‌ బోరింగ్‌ మెషీన (టీబీఎం) విధానాన్ని ఎంచుకున్నారు. ఇరు వైపులా రెండు టీ బీఎం మెషీన్లతో కొండను తొలుస్తారు. టన్నెల్‌-1 సొరంగ మా ర్గం(ఇనలెట్‌) పనులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా దోమలపెంట నుంచి ప్రారంభమై అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ముగుస్తాయి. ఇది మొత్తం 43కి.మీ ఇరువైపులా టీబీఎంల తో తవ్వుకుంటూ ఇప్పటివరకు 33.305కిలోమీటర్లు పూర్తి చేశా రు. మరో 10కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. టన్నెల్‌-2ను చంద ంపేట మండలం తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్ము వరకు 7.25 కి.మీ సొరంగం తవ్వాల్సి ఉండగా, అక్కడ ఇబ్బందులు లేకపోవడంతో బ్లాస్టింగ్‌ పద్ధతుల్లో పూర్తి చేసి లైనింగ్‌ పనులు తుదిదశకు చేర్చారు. 2018 మే నెలలో టన్నెల్‌ బేరింగ్‌ మిషన మరమ్మతుకు గురికావడంతో సొరంగమార్గం టన్నెల్‌ 1 పనులు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం బేరింగ్‌ ఏర్పాటుతో సొరంగం తవ్వకం పనులు మొదలయ్యాయని ఏఎమ్మార్పీ డివిజన-4 ఈ ఈ జగనమోహనరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే శ్రీశై లం నుంచి కొనసాగుతున్న ఇనలెట్‌ పనులు(టన్నెల్‌2) సాంకేతికలోపం కారణంగా నిలిచిపోయాయి. నిర్మాణానికి నిధుల కొరత లేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-14T07:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising