ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిండి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2021-06-22T06:56:15+05:30

డిండి ప్రాజెక్టు నుంచి నీటిని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ సోమవారం విడుదల చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని 12,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. గత ఏడాది ఆగస్టు చివరివారంలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది.

నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిండి, జూన్‌ 21: డిండి ప్రాజెక్టు నుంచి నీటిని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ సోమవారం విడుదల చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని 12,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. గత ఏడాది ఆగస్టు చివరివారంలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. గత యాసంగి పం టకు ఆయకట్టుకు నీటిని తీసుకునేందుకు రైతులు సుముఖత చూపలేదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 31.5అడుగుల(2 టీఎంసీలు) నీరు ఉన్నప్పటికీ వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీరందందు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు(2.4 టీఎంసీలు) కాగా, గతంలో పలుమా ర్లు సాగుకు సరిపడా నీరందక పంటచేలు ఎండిన సందర్భాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో ప్రాజెక్టులోకి నీరు వచ్చిచేరుతుందనే ఆశాభావంతో ఆయకట్టు రైతులు ప్రస్తుతం సాగుకు సన్నద్ధమవుతున్నారు. నీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సాగునీరు అం దించేందుకు ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. నాగార్జునసాగర్‌ ముంపు గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా నీటిని అందించేందుకు రూ.585 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

Updated Date - 2021-06-22T06:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising