ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు, ఎల్లుండి ప్రాజెక్టుల సందర్శన

ABN, First Publish Date - 2021-07-26T07:05:04+05:30

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధుల బృందం ఈ నెల 27,28తేదీల్లో పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, నక్కలగండి ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పల్లా నర్సింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి 

దేవరకొండ, జూలై 25 : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధుల బృందం ఈ నెల 27,28తేదీల్లో పాలమూరు రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, నక్కలగండి ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి తెలిపారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించి ఆరేళ్లయినా నేటికీ పూర్తి కాలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీని కుర్చీ వేసుకుని  తవ్విస్తానన్న హామీ నెరవేరలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. ఈ నెల 27న సీపీఐ ప్రతినిధుల బృందం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను సందర్శించిన అనంతరం రాత్రి డిండిలో బస చేస్తారని తెలిపారు. 28న డిండి నుంచి శ్రీశైలం సొరంగమార్గం, నక్కలగండి ప్రాజెక్టులను సందర్శిస్తారన్నారు.  సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లా దేవేందర్‌రెడ్డి, దేవరకొండ మండల కార్యదర్శి పార్లపల్లి కేశవరెడ్డి, నూనె రామస్వామి, ఆంజనేయులు, వెంకట్రాములు, వెంకటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-26T07:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising