ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ABN, First Publish Date - 2021-10-24T06:47:32+05:30

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని కోదాడ డీఎస్పీ రఘు అన్నారు. పట్టణంలోని సీతారాంనగర్‌ కాలనీలో శనివారం కార్డన్‌సెర్చ్‌ అనంతరం ఆయన మాట్లాడారు.

కార్డన్‌సెర్చ్‌లో మాట్లాడుతున్న డీఎస్పీ రఘు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, అక్టోబరు 23: గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని కోదాడ డీఎస్పీ రఘు అన్నారు. పట్టణంలోని సీతారాంనగర్‌ కాలనీలో శనివారం కార్డన్‌సెర్చ్‌ అనంతరం ఆయన మాట్లాడారు. యువత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు కావొద్దన్నారు. ఎక్కడ మత్తుమందు, గంజాయి దొరికినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వీటిపై ఉక్కుపాదం మోపుతామన్నా రు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం వాహనాలు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీ్‌సలకు సమాచారం అందించాలని కోరారు. సైబర్‌ నేరాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు, చిన్నారుల పై వేధింపులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 54 మోటార్‌ సైకిళ్లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకుని ఎంవీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు రామలింగారెడ్డి, శివరాంరెడ్డి, నర్సింహారావు, ఆంజనేయులు, ఎస్‌ఐలు కట్టా వెంకటరెడ్డి, రవి, వెంకన్న, సైదులు, నరేష్‌, కొండల్‌రెడ్డి, పోతుగంటి నాగేశ్వరరావు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T06:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising