ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సంసిద్ధం

ABN, First Publish Date - 2021-10-17T07:06:59+05:30

కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎయిమ్స్‌ సంసిద్ధంగా ఉందని సంస్థ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో 10పడకల సామర్థ్యంతో కూడిన ఇంటెన్సీవ్‌కేర్‌ యూనిట్‌ను(ఐసీయూ) దస రా పర్వదినం సందర్భంగా శనివారం ప్రారంభించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా 

బీబీనగర్‌, అక్టోబరు 16: కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఎయిమ్స్‌ సంసిద్ధంగా ఉందని సంస్థ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో 10పడకల సామర్థ్యంతో కూడిన ఇంటెన్సీవ్‌కేర్‌ యూనిట్‌ను(ఐసీయూ) దస రా పర్వదినం సందర్భంగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వికా్‌సభాటియా మాట్లాడుతూ, సెకండ్‌ వేవ్‌ సమయంలో సరిపడా ఐసీయూ పడకలు లేకపోవడంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగిందన్నారు. అదే సమయంలో దాతల సహకారంతో బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక కొవిడ్‌సేవలు అందించామన్నారు. మానవ వనరుల అవసరాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 25 జూనియర్‌ రెసిడెంట్‌, 34 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ నీరజ్‌ అగర్వాల్‌, డీన్‌ నితిన్‌ జాన్‌, డిప్యూటీ డైరెక్టర్‌ అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T07:06:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising