ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2021-10-21T06:50:22+05:30

జిల్లాలో ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్‌ పరీక్షలకు సర్వంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలి పారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట (కలెక్టరేట్‌), అక్టోబరు 20 : జిల్లాలో ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్‌ పరీక్షలకు సర్వంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలి పారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. రెవెన్యూ, హెల్త్‌, పోలీస్‌, మునిసిపల్‌, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జనరల్‌ కోర్సులో 7961 మంది,ఒకేషనల్‌ కోర్సులో 1684 మంది మొత్తంగా 9645 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 44 మంది పర్యవేక్షకులు, 44 మంది అధికారు లు, ఆరుగురు సిట్టింగ్‌ స్కాడ్‌లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు  

సూర్యాపేట అర్బన్‌: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇంటర్‌ పరీక్షలు నిర్వ హించనున్నట్లు డీఐఈవో కన్వీనర్‌ జానపాటి కృష్ణయ్య తెలిపారు. జిల్లాకేంద్రంలో ని డీఐఈవో కార్యాలయంలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో రవి, జి.లక్ష్మయ్య, శ్రీనివాస్‌, యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, సోమయ్య, పవన్‌, సైదులు పాల్గొన్నారు. 


మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీలదే : కలెక్టర్‌

పెన్‌పహాడ్‌ : గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపుల ఉపాధి కూలీలు నాటుతున్న మొక్కలను పరిశీలించి మాట్లాడారు. నాటిన మొక్కల చుట్టూ రక్షణవలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో వెంకటాచారి, ఎంపీవో నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising