ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోతులపాటి సోమశర్మ శివైౖక్యం

ABN, First Publish Date - 2021-06-03T06:14:59+05:30

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థాన విశ్రాంత ప్రధానార్చకుడు, చెర్వుగట్టు పెద్దయ్యగారు పోతులపాటి సోమశర్మ(85) బుధవారం తెల్లవారుజామన శివైక్యం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెర్వుగట్టు పెద్దయ్యగారిగా భక్తులకు సుపరిచితం

ప్రధానార్చకుడిగా రామలింగేశ్వరుడికి సేవలు

జన్మతః అంధత్వం.. జ్ఞాననేత్రంతో పాండిత్యం 

నార్కట్‌పల్లి, జూన్‌ 2: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థాన విశ్రాంత ప్రధానార్చకుడు, చెర్వుగట్టు పెద్దయ్యగారు పోతులపాటి సోమశర్మ(85) బుధవారం తెల్లవారుజామన శివైక్యం చెందారు. వయోభారంతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తుదిశ్వాస విడిచే వరకూ ఆయన స్వామివారి సేవలోనే తరించారు. సోమశర్మ జన్మతః అంధుడు. బ్రహ్మచారిగానే ఉండిపోయారు. తాను అంధుడని ఆయనెన్నడూ బాధప డలేదు. ప్రతిదీ ఈశ్వరేఛ్చ అనుకునేవారు. 7వ ఏట జరిగిన ఉప నయనంతోనే నిత్యం తన ఇష్టదైవం రామలింగేశ్వరుని సేవలోనే తరించారు. తండ్రి వెంట ఆలయానికి వెళ్లి అర్చక విధానాన్ని అవపోసనపట్టారు. సుమారు 60ఏళ్ల పాటు కఠోర నిష్టతో చెర్వుగట్టు దేవస్థాన అర్చకుడిగా విశేష సేవలందించిన సోమశర్మకు ‘విజయ రథశాంతి’ వేడుకను రెండేళ్ల కిందటే నిర్వహించారు. 

సోమశర్మ రచనలు 

స్వామివారికి అర్చన, అభిషేక సేవలతో పాటు రామలింగేశ్వరుని కీర్తిస్తూ అనేక శ్లోకాలు, పలు దేవతామూర్తులను ఆరాధిస్తూ రచనలు, తెలుగు అనువాదాలు చేసి పాండిత్యాన్ని ప్రదర్శించారు. రాయడం రాకపోవడంతో కుటుంబసభ్యులు, అర్చ క శిష్యుల సహకారంతో రా యించేవారు. స్వామివారికి మే లుకొలుపు, సుప్రభాతసేవ, స్ర్తోత్త్రం, మంగళశాసనం, రా మలింగేశ్వరస్వామి శతకం రచి ంచారు. విఘ్నేశ్వర, సుబ్రహ్మ ణ్య, వేంకటేశ్వర, లక్ష్మీదేవిలకు అష్తోత్తర శతనామాలు, అ య్యప్ప పంచరత్నమాల, ఆంజనేయ మాతృకాస్తవం, యాదాద్రి లక్ష్మీ నరసింహ్మా స్తోత్త్రం, లలితాసహస్ర నామావళి వంటి సంస్కృత రచనలను సోమశర్మ తెలుగులో అనువాదం చేశారు. 

పలువురి సంతాపం 

పోతులపాటి సోమశర్మ శివైౖక్యం చెందడంపై పలువురు సంతాపం తెలిపారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, దేవస్థాన చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, మాజీ చైర్మన్‌లు రేగట్టె రాజశేఖర్‌రెడ్డి, పున్నపురాజు యాదగిరి, నేతకాని కృష్ణయ్య, దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ, ధర్మకర్తలు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-06-03T06:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising