ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిరప తోటల్లో సస్యరక్షణ చేపట్టాలి

ABN, First Publish Date - 2021-12-03T06:41:42+05:30

మిరప తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆధికదిగుబడులు సాధించాలని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్‌ నరేష్‌ తెలిపారు.

తుంగతుర్తి మండలం రావులపల్లిలో మిరపతోటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుంగతుర్తి, ఆత్మకూర్‌(ఎస్‌), డిసెంబరు 2: మిరప తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆధికదిగుబడులు సాధించాలని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సీహెచ్‌ నరేష్‌ తెలిపారు. మండలంలోని రావులపల్లి గ్రామంలో నల్ల, తామర పరుగులు ఆశించిన మిరపతోటలను ఆయన గురువారం పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిరపలో తామర పురుగుల నివారణకు ఉద్యానశాఖ అధికారుల సూచనల మేరకు మందులు పిచికారీ చేయాలన్నారు. దీంతోపాటు ఎకరాకు 20 నీలిరంగు అట్టలు ఏర్పాటుచేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. పసుపు రంగు అట్టలతో తెల్లదోమలను నివారించవచ్చన్నారు. ఆయన వెంట ఉద్యానవన అధికారి స్రవంతి, శాస్త్రవేత్త కిరణ్‌, తదితరులు ఉన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలోని రామన్నగూడెం, ఏపూర్‌ గ్రామాల్లో మిరప తోటలను జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్‌గౌడ్‌, జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌ గురువారం పరిశీలించారు. వారివెంట అధికారులు కన్న జగన్‌, శివమూర్తి, సర్పంచ్‌ రజితసుధాకర్‌, పలువురు రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-12-03T06:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising