ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ బోర్డులో పెండింగ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-07-27T06:51:53+05:30

సంక్షేమ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఐటీయూ అధ్యక్ష, కార్య దర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  భువనగిరి రూరల్‌, జూలై 26: సంక్షేమ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఐటీయూ అధ్యక్ష, కార్య దర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఏసీఎల్‌, డీసీఎల్‌ పోస్టులు భర్తీ చేయాలని కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమ వారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పెంచిన స్టీల్‌, ఇసుక, సిమెంట్‌ ఇతర సామగ్రి ధరలను తగ్గించాలని, బోర్డు కనీస పింఛన్‌ రూ.5వేలు, వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పక్కదారి పట్టించిన రూ.1000 కోట్లను వెంటనే బోర్డులో జమచేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు బోడిగె సోములు, మాయ కృష్ణ, రమేష్‌, మల్లేశం, శ్రీరాములు, శ్రీనివాస్‌, నర్సింహ, స్వామి, అమరేందర్‌ పాల్గొన్నారు. 

ధర్నాకు తరలిన భవన నిర్మాణ కార్మికులు

వలిగొండ: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాకు మండలం నుంచి భవన నిర్మాణ కార్మికులు తరలివెళ్లారు. తరలి వెళ్లినవారిలో  సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుర్కపల్లి సురేందర్‌, మల్లేశం, నరసింహ, ఎల్లస్వామి, వెంకటేష్‌, కుమార్‌, స్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:51:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising