ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి కేసులో నిందితుడిపై పీడీయాక్ట్‌ నమోదు

ABN, First Publish Date - 2021-12-31T05:34:50+05:30

గంజాయి అక్రమ రవాణ కేసులో పట్టుబడిన నిందితుడిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదైంది. నిందితుడిని హైదరాబాద్‌లోని చెంచలగూడ జైల్‌ సిబ్బందికి గురువారం ఆప్పగించారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మహమద్‌ మోహిద్‌ కూలి పని చేసుకుంటూ హైదరాబాద్‌లో జీవిస్తున్నాడు. సెప్టెంబరు 25వ తేదీన వైజాగ్‌లోని బీమిలి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా కోదాడ రూరల్‌ పోలీసులు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట క్రైం, డిసెంబరు 30: గంజాయి అక్రమ రవాణ కేసులో పట్టుబడిన నిందితుడిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదైంది. నిందితుడిని హైదరాబాద్‌లోని చెంచలగూడ జైల్‌ సిబ్బందికి గురువారం ఆప్పగించారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన మహమద్‌ మోహిద్‌ కూలి పని చేసుకుంటూ హైదరాబాద్‌లో జీవిస్తున్నాడు. సెప్టెంబరు 25వ తేదీన వైజాగ్‌లోని బీమిలి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తుండగా కోదాడ రూరల్‌ పోలీసులు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఇతని వద్దనుంచి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.3లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మహమద్‌ మోహిద్‌ గతంలో కూడా గంజాయి రవాణ చేస్తూ పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు మళ్లీ గంజాయి నేరాలకు పాల్పడవద్దనే పీడీ యాక్టు అమలు చేసి చెంచలగూడ సెంట్రల్‌ జైల్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిషేదిత పదార్థాలతో వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 


Updated Date - 2021-12-31T05:34:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising