ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పట్టణ ప్రగతి’ పనుల బిల్లులు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-10-21T06:53:06+05:30

‘పట్టణ ప్రగతి’లో వినియోగించిన వాహనాలకు బిల్లులు చెల్లించాలని యజమానులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు భువనగిరి మునిసిపల్‌ కార్యాలయాన్ని ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు, డోజర్లతో బుధవారం ముట్టడించారు.

వాహనాలతో వచ్చి మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన యజమానులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునిసిపల్‌ కార్యాయాన్ని ముట్టడించిన వాహనదారులు 


భువనగిరి టౌన్‌, అక్టోబరు 20: ‘పట్టణ ప్రగతి’లో వినియోగించిన వాహనాలకు బిల్లులు చెల్లించాలని యజమానులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు భువనగిరి మునిసిపల్‌ కార్యాలయాన్ని ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు, డోజర్లతో బుధవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు వాహన యజమానులు మాట్లాడుతూ ‘పట్టణ ప్రగతి’ ముగిసి నెలలు గడుస్తున్నా చేసిన పనులకు నేటికీ బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే సమయంలో జిల్లా స్థాయి దిశ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రమేలాసత్పథి హాజరవుతున్నందున యజమానుల ధర్నాతో మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో వాహన యజమానుల తో మునిసిపల్‌ చెర్మన్‌ ఆంజనేయులు, కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌ చర్చించి నవంబరు 10వ తేదీ లోపు రూ.29లక్షల బిల్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

Updated Date - 2021-10-21T06:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising