ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుళార్థక సేవాకేంద్రాలుగా పీఏసీఎ్‌సలు

ABN, First Publish Date - 2021-07-28T06:29:25+05:30

ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ బహుళార్థక సేవాకేంద్రాలుగా మారనున్నాయని డీసీసీబీ చైర్మన్‌, టెస్కా బ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఉమాభవాని కుటుంబ సభ్యులకు ఎల్‌వోసీ అందజేస్తున్న డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి


యాదాద్రి రూరల్‌, జూలై 27: ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ బహుళార్థక సేవాకేంద్రాలుగా మారనున్నాయని డీసీసీబీ చైర్మన్‌, టెస్కా బ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వంగపల్లి పీఏసీఎస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాలకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు ఆర్థికంగా బలపడేందు కు ఈ బహుళార్థక సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. నాబార్డు సహకారంతో అర్హత పొందిన సంఘాలకు రూ.2కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ రుణాన్ని సక్రమం గా వినియోగించుకొని,సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ లభిస్తుందన్నారు.నాబార్డు రుణాలతో గోదాములు, రైస్‌మిల్లులు, పెట్రోబంక్‌లు ఏర్పాటు చేసుకొని వాటిద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో మదన్‌మోహన్‌, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ మనీకాంతి, ఏజీఎం ఉదయ్‌శ్రీ, స్థానిక సంఘం వైస్‌ చైర్మన్‌ ఎగ్గిడి బాలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మునిసిపాలిటీ పరిధిలోని కొత్తగుండ్లపల్లి గ్రామానికి చెందిన సూదగాని ఉమాభవాని కుటుంబసభ్యులకు రూ.1లక్ష ఎల్‌వోసీని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అందజేశారు. ఉమాభవాని అనారోగ్యంతో కొంతకాలంగా నిమ్స్‌లో చికిత్సపొందుతోంది.

Updated Date - 2021-07-28T06:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising