ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన పథకాలు దేశానికే ఆదర్శం

ABN, First Publish Date - 2021-07-27T06:46:34+05:30

సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దేవరకొండలో సో మవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

దేవరకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలి

శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 


దేవరకొండ, జూలై 26: సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దేవరకొండలో సో మవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  దేశంలో ఎక్కడాలేని విధం గా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి జీర్ణించుకోలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, వారి మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డిలు మాట్లాడే భాష, పద్ధతి మార్చుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదీజలాల కేటాయింపులో తెలంగాణకు అన్యా యం జరిగేలా వ్యవహరిస్తోంద ని ఆరోపించారు. బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితులు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కేటాయింపుతోపాటు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి చేస్తున్నట్లు  గుత్తా తెలిపారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ జాన్‌యాదవ్‌, శిరందాసు కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising