ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సభాస్థలి పరిశీలన

ABN, First Publish Date - 2021-04-13T06:38:38+05:30

సీఎం కేసీఆర్‌ సభ ఈ నెల 14న హాలియాలో నిర్వహించనుండటంతో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.

కేసీఆర్‌ సభా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎస్పీ రంగనాథ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలియా, ఏప్రిల్‌ 12: సీఎం కేసీఆర్‌ సభ ఈ నెల 14న హాలియాలో నిర్వహించనుండటంతో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. వారివెం ట ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, బండా ప్రకాశ్‌, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, మలిగిరెడ్డి లింగారెడ్డి తదితరులు ఉన్నారు.


హెలీప్యాడ్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి

నాగార్జునసాగర్‌: సీఎం కేసీఆర్‌ సభ నేపథ్యంలో సాగర్‌ బీసీ గురుకుల పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ హెలీకాఫ్టర్‌లో సాగర్‌లో దిగి, రోడ్డు మార్గంలో హాలియాలోని సభా ప్రాంగణానికి వెళ్తారు. దీంతో హెలీప్యాడ్‌ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.


పోలింగ్‌ బూత్‌ పరిశీలన

గుర్రంపోడు: సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో మండలంలోని కొప్పోల్‌ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేయనున్న పో లింగ్‌ బూత్‌ను ఎన్నికల పరిశీలకుడు సజ్జన్‌చౌహాన్‌ సోమవారం పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఆంజనేయులు, సుదర్శన్‌ తదితరులున్నారు. కాగా, మండలంలోని మక్కపల్లి,పాశంవారిగూడెం, కాల్వపల్లి, జూనూతుల గ్రామా ల్లో కొండమల్లేపల్లి సీఐ పరుశరాములు ఆధ్వర్యంలో పారామిలటరీ బలగాలు సోమవారం కవాతు నిర్వహించాయి.

Updated Date - 2021-04-13T06:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising