ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక సమారాధనలతో కళకళలాడిన నృసింహక్షేత్రం

ABN, First Publish Date - 2021-11-29T06:41:12+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక సమా రాధనలు, భక్తులతో ఆదివారం కళకళలాడింది. వారాంతపు సెల వు, కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చారు. ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.

ఆలయ తిరువీధుల్లో భక్తుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలాహలంగా ఆలయ తిరువీధులు


యాదాద్రి టౌన్‌, నబంబరు 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక సమా రాధనలు, భక్తులతో ఆదివారం కళకళలాడింది. వారాంతపు సెల వు, కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చారు. ఇష్టదైవాన్ని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు. భక్తుల హరిహరనామ స్మరణతో యాదాద్రికొండంతా మార్మోగింది. యాత్రాజనులు, ఘాట్‌రోడ్‌ పరిసర ప్రాంతాలు కిటకిటలాడా యి. స్వామివారి దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు క్యూలైన్లలో గంటలతరబడి వేచివున్నారు. ధర్మదర్శనాలకు 5గంటలు, ప్రత్యేక దర్శనాలకు 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయం లో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపం లో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండపై పార్కింగ్‌ ప్రదేశాలు లేకపోవడం, ఆల య విస్తరణ పనులు కొనసాగుతుండటంతో భక్తుల వాహనాలను పోలీసులు కొండకింద రింగురోడ్డు, పాత గోశాల, తులసికాటేజ్‌ వద్ద పార్కిం గ్‌ చేయించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో రావడంతో ఘాట్‌రోడ్‌, పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా, స్వామివారి ప్రసాదాల విక్రయంతో రూ.11.04లక్షలు, బాలాలయంలో ఆర్జిత సేవా కైంకర్యాలతో రూ.6.77లక్షలు, వీవీఐపీ దర్శనాలతో రూ.6.15 లక్షల ఆదాయం సమకూరింది. అన్ని విభాగాల ద్వారా రూ.37,09,808 ఆదాయం వచ్చింది. కాగా, పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను సైతం భక్తులు దర్శించుకొని సేవోత్సవాల్లో పాల్గొన్నారు.


వైభవంగా అభిషేకం, నిత్యార్చనలు

యాదాద్రీశుడి సన్నిధిలో స్వామి వారికి నిజాభిషేకం, నిత్యార్చనలు వైభవంగా కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన అర్చకులు బాలాలయంలో ఉత్సవమూర్తులను అభిషేకించి తులసి దళాలతో అర్చించారు. బాలాలయ కల్యాణమండపంలో విశ్వక్సేనుడికి తొలి పూజలతో సుదర్శన హోమం, నిత్యకల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరాలు, కొండకింద వ్రతమండపంలో సత్యదేవుడి వ్రతపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు స్మార్త సంప్రదాయరీతిలో నిర్వహించారు. మహిళ లు బాలాలయ ఆవరణలోని తులసిమాతను పసుపు, కుంకుమలతో కొ లిచి దీపారాధన చేశారు. ఇదిలా ఉండగా, కార్తీక మాసంలో చివరి ఆదివారం కావడంతో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో 1,215 మంది దంపతులు పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతపూజల ద్వారా రూ.6.07లక్షల ఆదాయం సమకూరింది. యాదాద్రీశుడిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకున్నారు.

Updated Date - 2021-11-29T06:41:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising