ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక చెత్త రహితం

ABN, First Publish Date - 2021-10-12T05:50:23+05:30

రహదారులపై చెత్త కనిపించకుండా జిల్లాలోని మునిసిపాలిటీల్లో ట్విన్‌ బిన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రగతి నిధులతో 42 ట్విన్‌ బిన్స్‌(జంట చెత్త బుట్టలు)ను జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలకు అధికారులు పంపిణీ చేస్తున్నారు.

పంపిణీకి సిద్ధంగా ఉన్న ట్విన్‌బిన్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు మునిసిపాలిటీలకు 42 ట్విన్‌ బిన్స్‌


భువనగిరి టౌన్‌, అక్టోబరు 11 : రహదారులపై చెత్త కనిపించకుండా జిల్లాలోని మునిసిపాలిటీల్లో ట్విన్‌ బిన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రగతి నిధులతో 42 ట్విన్‌  బిన్స్‌(జంట చెత్త బుట్టలు)ను జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. పట్టణాల్లోని ప్రధానకూడలిలో ఏర్పాటు చేయనున్న వీటిలో ప్రజలు స్వచ్ఛందంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. వీటిలో పోగయ్యే చెత్తను రోజ వారిగా మునిసిపల్‌ సిబ్బంది సేకరించి డంప్‌ యార్డులకు తరలిస్తారు. ప్రజలు సామాజిక బాధ్యతగా చెత్తను ఆ బాక్సుల్లో వేస్తే రహదారులపై చెత్త తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతానికి 42 చెత్త బుట్టలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నప్పటికీ త్వరలో మరిన్ని ఏర్పాటుచేస్తామని అధికారులు తెలిపారు. అయితే నిర్వహణ లోపం కారణంగా భువనగిరి మునిసిపాలిటీలో గతంలో ఏర్పాటుచేసిన చెత్తబుట్టలు ప్రస్తుతం కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. లక్ష్యం మంచిదైనా నిర్వహణ లోపిస్తే నిరుపయోగమయ్యే పరిస్థితులు ఉంటాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. 

మునిసిపాలిటీల వారిగా

జిల్లాలో ఆరుమునిసిపాలిటీల్లో మొదటిదఫాగా ట్విన్‌ బిన్స్‌ను ఏర్పాటు చేయనున్నా రు. భువనగిరి మునిసిపాలిటీలో 16, మిగతా 26 ట్విన్‌ బిన్స్‌ను పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూర్‌, చౌటుప్పల్‌ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు. 


Updated Date - 2021-10-12T05:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising