ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో తొమ్మిది మంది మృతి

ABN, First Publish Date - 2021-05-10T06:41:29+05:30

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. అదే విధంగా వివిధ పీహెచ్‌సీలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 594 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

నడిగూడెం మండలం తెల్లబెల్లిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్న గ్రామపంచాయతీ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

594 పాజిటివ్‌ కేసులు నమోదు

నల్లగొండ, మే 9: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం కరోనాతో తొమ్మిది మంది మృతి చెందారు. అదే విధంగా వివిధ పీహెచ్‌సీలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 594 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నల్లగొండ జిల్లాలో 156, సూర్యాపేట 298, యాదాద్రి భువనగిరి జిల్లాలో 140మందికి మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటివరకు 85,168మంది కరోనా బారిన పడగా; 349మంది చికిత్స పొందుతూ మృతిచెందారు. 58,254మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి కాగా, 26,565మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది హోంఐసొలేషన్‌లో ఉన్నారు. 


ఒక్క రోజు తేడాతో దంపతులు మృతి 

నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని మార్కెట్‌ రోడ్డులో నివా సం ఉంటున్న వృద్ధ దంపతులకు కరోనా పాజిటివ్‌తో ఒక రోజు తేడాతో మృతి చెందారు. వారం రోజుల క్రితం మొదటగా భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 7వ తేదీన ఆమె మృతి చెందింది. అదే రోజు భర్తకు పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్‌ రావడంతో మరో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున భర్త కూడా చనిపోయారు. ఒక రోజు తేడాతో తల్లిదండ్రులు కరోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన వ్యక్తి(49), నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామానికి చెందిన ఓ మహిళ(55), మర్రిగూడ మండలంలో ఒకరు, పీఏపల్లి మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన మహిళ(51), నాగార్జున సాగర్‌లో ఓ మహిళ(50),   నకిరేకల్‌ మునిసిపాలిటీకి చెందిన వ్యక్తి(39), యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) రహీంఖాన్‌పేటకు చెందిన యువకుడు(27), బీబీనగర్‌ మండలం నెమురగోములలో వృద్ధుడు (76), మోటకొండూరు మండలం చందేపల్లికి చెందిన రిటైర్డ్‌ వీఆర్‌వో కరోనాతో మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2021-05-10T06:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising