ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-01-14T05:45:35+05:30

కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

ఆలేరు, జనవరి 13: కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు 46 రోజులుగా ఢిల్లీ రాజధానిలో చేపడుతున్న ఆందోళనకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఈ నెల 1నుంచి చేపట్టిన బస్సు జాతా మంగళవారం రాత్రి ఆలేరుకు చేరిన సంద ర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు మంగ నర్సింహులు, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌, వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ, న్యూడె మొక్రసి జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్‌, మామిడాల భిక్షపతి, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదరి కెమిడి ఉప్పలయ్య, ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి పల్లెపు అడవయ్య,  కొల్లూరి రాజయ్య, జూకంటి పౌల్‌, బాలరాజు, రమేష్‌, బాలయ్య పాల్గొన్నారు. 

 సుప్రీంకోర్టు తీర్పు రైతులకు సంక్రాంతి కానుక : బీర్ల

యాదాద్రి రూరల్‌, జనవరి 13: అగ్రి చట్టాలపై సుప్రీంకోర్టు తీర్పు రైతులకు సంక్రాంతి కానుక అని ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్జి బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం పట్టణ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2021-01-14T05:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising