ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనుల్లో వేగం పెంచాలి

ABN, First Publish Date - 2021-02-25T05:58:15+05:30

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని బుఽధవారం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం నిర్వహించారు.

ఆలయ విస్తరణ పనులను పరిశీలిస్తున్న సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి 

భక్తుల మౌలిక వసతులపై దృష్టి సారించాలి


యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 24: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆదేశించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని బుఽధవారం సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆయ న వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఈవోగీ తారెడ్డిలతో కలిసి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. ప్రధానాలయ సప్తతల మహా రాజగోపురం, వేం చేపు మండపం, ఆలయ తిరు మాఢవీధులు, శివాలయం, విష్ణుపుష్కరిణి పరిశీలించారు. కొండకింద రింగురోడ్డు, యాదగిరిపల్లి శివారులోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌లతోపాటు గండి చెరువు సమీపంలోని పుష్కరిణి, కల్యాణకట్ట, అన్నప్రసాద భవనం, సత్యనారాయణస్వామి వ్రత మండపం పనులను పరిశీలించారు. విస్తరణ పనుల పురోగతి, నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పనుల పూర్తికి సలహాలు, సూచనలు అందజేశారు. కొండపైన లిఫ్టు, రథశాల నిర్మాణాలు పరిశీలించి అష్టభుజి ప్రాకార మండపం, ప్రధానాలయంపై కప్పు నుంచి వర్షపు నీరు వెళ్లే మార్గాలపై ఆరాతీశారు. వర్షపు నీటి లీకేజీలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్మాణాలు చేసినట్లు స్థపతులు ఆయనకు వివరించారు. 


బ్రాస్‌ క్యూలైన్ల పనుల పరిశీలన

తూర్పు రాజగోపురం ముందు బ్రాస్‌ క్యూలైన్ల నిర్మాణాన్ని పరిశీలించి, తూర్పు ఆగ్నేయ దిశలోని అష్టభుజి ప్రాకార మండపంలో క్యూలైన్‌ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని భూపాల్‌రెడ్డి సూచించారు. అనంతరం ప్రధానాలయంలో శిల్ప నిర్మాణాలను పరిశీలించి సాలాహారాల్లో దేవతా విగ్రహాలు అమర్చే పనులు పూర్తిచేయాలని స్థపతులకు సూచించారు. స్వామివారి విమాన గోపుర పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రహదారి విస్తరణపై రింగురోడ్డు నిర్వాసితులు భూపాల్‌రెడ్డిని నలదీయగా, ఆయన సమాధానం చెప్పకపోవడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. యాదగిరిపల్లి శివారులోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనులు పరిశీలించి సీఎం పర్యటన నాటికి విల్లాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, డాక్టర్‌ ఆనందాచారివేలు ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు. 


యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం నిత్యారాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేకువజామునే మూలమూర్తులను కొలిచి, బాలాలయంలో కవచమూర్తులకు హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి తులసి దళాలతో అర్చనలు జరిపారు. సుదర్శనహోమం, నిత్యకల్యాణ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు కొనసాగాయి. శివాలయంలో పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి, ఉప ఆలయంలో చరమూర్తులకు శైవ సంప్రదాయరీతిలో పూజలు కొనసాగాయి. సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  

Updated Date - 2021-02-25T05:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising