ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యం

ABN, First Publish Date - 2021-06-18T07:06:14+05:30

గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యం

జలాల్‌పూర్‌లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 17: గ్రామాల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్య మని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో ‘పల్లె సందర్శన’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్‌, భువనగిరి మండలాలకు మొత్తం రూ.30 కోట్ల మంజూరయ్యాయ న్నారు. అయితే మొదటి విడతగా ఒక్కో మండలానికి రూ.5 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకుని సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. జలాల్‌పూర్‌ గ్రామంలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, అండర్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పలువురి బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. గ్రామంలోని డ్రైనేజీ పనులు, శ్మశానవాటిక నిర్మాణ పనులు పరిశీలించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయంలో ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ పభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ  పుష్పలత, వైస్‌ ఎంపీపీ వెంకటేశంయాదవ్‌, సర్పంచు పర్నె మల్లారెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి,  భిక్షపతి, విశ్వనాథంగౌడ్‌,  కృష్ణగౌడ్‌, భూపాల్‌రెడ్డి, ఎంపీడీవో బాలశంకర్‌, తహసీల్దార్‌ దశరథనాయక్‌ పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత

వలిగొండ: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన  కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పం పిణీ చేశారు. నూతన వధూవరులకు తన సొంత నిధులతో పట్టు చీర, పట్టు దోతి కూడిన ఒక గిఫ్ట్‌ప్యాక్‌ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్‌రాజు, తహసీల్దార్‌ నాగలక్ష్మి,  మార్కెట్‌ కమిటీ చైర్‌ప ర్సన్‌ కునపురి కవిత, సర్పంచ్‌ బోళ్ల లలిత,  ఎంపీటీసీలు భాగ్యమ్మ, యశోద, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురకంటి వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో గీతారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T07:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising