ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిరేకల్‌ మునిసిపాలిటీ ఎన్నికల్లో తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు

ABN, First Publish Date - 2021-04-17T06:33:30+05:30

నకిరేకల్‌ మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తొలిరోజు శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక జడ్పీహెచ్‌ఎ ్‌సలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ సెంటర్‌ను అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌శ ర్మ పరిశీలించారు.

నామినేషన్‌ల సెంటర్‌ను పరిశీలిస్తున్న రాహుల్‌ శర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నామినేషన్‌ సెంటర్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ 


నకిరేకల్‌, ఏప్రిల్‌ 16 : నకిరేకల్‌ మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తొలిరోజు శుక్రవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక జడ్పీహెచ్‌ఎ  ్‌సలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ సెంటర్‌ను అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌శ ర్మ పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు తగు జా గ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్లు సమర్పించేందుకు వస్తున్న వారు మాస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నామినేషన్‌ ప్రక్రియ కొనసాగించాలని నామినేషన్‌ వేసే అభ్యర్థి బలపర్చిన వ్యక్తితో పాటు మరొకరిని మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. నకిరేకల్‌ మునిసిపాలిటీ 20వార్డులకు గా ను తొలిరోజు  రెండో వార్డుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎండీ.ఆసిఫ్‌, 15వ వార్డుకు టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున షహనాజ్‌ మోయిజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 20వార్డులకు గాను 8నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మునిసిపల్‌ కమిషనర్‌ బాలాజీ తెలిపారు. శనివారం రోజు మంచి రోజు కాగా అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-17T06:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising