ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేత్రపాలకుడికి నాగవల్లి దళార్చనలు

ABN, First Publish Date - 2021-04-21T06:45:02+05:30

యాదాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం విశేషపూజలు నిర్వహించారు. కొండపై విష్ణుపుష్కరిణి, అనుబంధ పాతగుట్ట ఆలయంలోని ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ అర్చకులు వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం చేశారు.

హోమ పూజలు నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 20: యాదాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం విశేషపూజలు నిర్వహించారు. కొండపై విష్ణుపుష్కరిణి, అనుబంధ పాతగుట్ట ఆలయంలోని ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ అర్చకులు వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం చేశారు. సింధూరం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మహానివేదనలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని స్వయంభువులను కొలిచిన పూజారులు బాలాలయంలో కవచమూర్తులకు హారతినివేదించారు. అనంతరం అభిషేకం, అర్చనలు, హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. రామలింగేశ్వరస్వామికి, ఉపాలయంలో చరమూర్తులకు నిత్యపూజలు శైవాగమపద్ధతిలో నిర్వహించారు. ఇదిలా ఉండగా ఉపాలయంలో సాయంత్రం సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు వేడుకలు ఆస్థానపరంగా కొనసాగాయి. ఇదిలాఉంటే ఓవైపు కరోనా సెకండ్‌వేవ్‌, మరోవైపు భానుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చుతుండడంతో యాదాద్రిక్షేత్రానికి వచ్చే భక్తులసంఖ్య గణనీయంగా తగ్గుతోంది. భక్తుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం, నిత్యాదాయంపై ప్రభావం చూపుతోంది. యాదాద్రిక్షేత్రం మంగళవారం భక్తుల సందడి లేక వెలవెలబోయింది. వివిధ విభాగాల ద్వారా రూ.2,84,514 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా తూర్పు, ఉత్తర దిశలోని రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఉత్తరదిశలోని రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తయితే కొండపైన మిగిలిన నిర్మాణాలు వేగిరమవుతాయని, ఇందుకోసం కొండపైన విష్ణుపుష్కరిణి ప్రాంతంలోని రహదారిని తొలగించినట్టు అధికారులు వివరించారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం మరో వారం 10 రోజుల్లో పూర్తి చేసి రహదారిని పునరుద్ధరించనున్నట్లు వివరించారు.  


కరోనా నుంచి సీఎం కోలుకోవాలని హోమం

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలని కాంక్షిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం హోమపూజలు నిర్వహించారు. బాలాలయ కల్యాణమండపంలో యాదాద్రి దేవస్థాన ప్రధాన అర్చకుడు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహచార్యుల ఆధ్వర్యంలో కేసీఆ ర్‌ గోత్రనామాలతో సంకల్పం నిర్వహించారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్ల నిజాభిషేకం, నిత్యార్చనలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణం చేశారు.  

Updated Date - 2021-04-21T06:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising