ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో పనిచేయాలి : రాజగోపాల్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-02-27T05:55:24+05:30

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి, పఽఽథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండూరు, ఫిబ్రవరి 26: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి, పఽఽథకాలను ప్రజలకు చేరువయ్యేలా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చండూరులో ఎంపీపీ పల్లె కళ్యాణి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులు లేకుండా నిషేధించినట్లయితే ఆయా గ్రామ పంచాయతీలకు రూ.5లక్షల రివార్డు ఇస్తానని తెలిపారు. గ్రామాల్లోని కృష్ణా జలాలు కలుషితం కాకు ండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ప్రోటోకాల్‌ ప్రకారంగా ఎంపీటీసీలకు సరైన గౌరవం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో గోశిక బాలకృష్ణ, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, వైస్‌ ఎంపీపీ మందడి నర్సింహారెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జాతరలు భక్తిభావానికి ప్రతీకలు
నాంపల్లి :  జాతరలు భక్తిభావానికి ప్రతీకలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని బండతిమ్మాపురంలో శుక్రవారం శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి కల్యాణంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ వేడుకల్లో స్వామివారికి నూతన వస్ర్తాలను అందజేశారు. అనంతరం ఆ గ్రామ సర్పంచ్‌ రెవెల్లి సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను కెమ్మెల్యే ప్రారంభించారు.  అనంతరం మండల కేంద్రంలో నాలుగు రోజులుగా జరుగుతున్న మహాచండీయాగంలో పాల్గొన్నారు. గ్రామంలోని గోదాసు వెంకటయ్య, రావిరాల లింగయ్య కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు పూల వెంకటయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-02-27T05:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising