ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంత్‌ సేవాలాల్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2021-02-25T06:34:16+05:30

సంత్‌ సేవాలాల్‌ స్ఫూర్తితో గిరిజనులు ముందుకు సాగాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

వేడుకలో మాట్లాడుతున్న శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
దేవరకొండ, ఫిబ్రవరి 24 :
సంత్‌ సేవాలాల్‌ స్ఫూర్తితో గిరిజనులు ముందుకు సాగాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. దేవరకొండలోని సంత్‌ సేవాలాల్‌ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన సేవాలాల్‌ 282వ జయంతి వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులు సేవాలాల్‌ చూపిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలు సాధించాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ సంత్‌ సేవాలాల్‌ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీలో తీ ర్మానించి కేంద్రానికి పంపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ సం దర్భంగా సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ గిరిజన సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో యాదాద్రి దేవాలయ ఉపస్థపతి మోతీలాల్‌, సంత్‌ సేవాలాల్‌ ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కేతావత్‌ లక్ష్మణ్‌నాయక్‌, కొర్ర శంకర్‌నాయక్‌, పంతులాల్‌నాయక్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సిం హ, కళ్యాణ్‌నాయక్‌, వడ్త్య దేవేందర్‌నాయక్‌, గోపాల్‌సింగ్‌, నారాయణసింగ్‌, ధరమ్‌సింగ్‌, పాపానాయక్‌, చందర్‌నాయక్‌, పవిత్రబాయి, రవినాయక్‌, రమావత్‌ శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ చూపిన మార్గంలో గి రిజనులు నడవాలని బంజార సేవా సంఘం మండల అధ్యక్షుడు రమావత్‌ భోడ్యానాయక్‌ సూచించారు. సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి సందర్భంగా  బంజార సేవా సంఘం, లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన భోగ్‌బండారో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  కార్యక్రమంలో  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ, మండల ఇన్‌చార్జి  లక్ష్మణ్‌నాయక్‌, మండల ప్రధాన కార్యదర్శి రాంచంద్రునాయక్‌, అధికార ప్రతినిధి పాండునాయక్‌, పాల్గొన్నారు.



Updated Date - 2021-02-25T06:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising