ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద ముంపు నుంచి కాపాడాలి

ABN, First Publish Date - 2021-07-25T06:39:49+05:30

అధిక వర్షాలతో ఇళ్లు నీళ్లలో మునిగిపోతున్నా యని, మూడు రోజులుగా నీటిలో ఇబ్బందులు పడుతున్నామని నడిగూడెం గ్రామానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌కు తమ గోడు వెలిబుచ్చారు.

ఎమ్మెల్యేకు సమస్యను వివరిస్తున్న వరద బాధిత మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, జూలై 24: అధిక వర్షాలతో ఇళ్లు నీళ్లలో మునిగిపోతున్నా యని, మూడు రోజులుగా నీటిలో ఇబ్బందులు పడుతున్నామని నడిగూడెం గ్రామానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌కు తమ గోడు వెలిబుచ్చారు. వృక్షార్చనలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యలను మహిళలు తీసుకెళ్లారు. బీసీ, ఎస్సీ కాలనీలలో చెరువు అలుగు, వరద నీటితో ఏడాదికాలంగా అవస్థలు పడుతున్నామన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్డులేక నీరు ఇళ్లలోకి చేరుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయా కాలనీ లో నెలకొన్న ఇబ్బందులను తొలగించేందుకు సహాయ చర్యలు చేపట్టినట్లు జడ్పీటీసీ బానాల కవితనాగరాజు, ఎంపీడీవో ఇమాం సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మీ మల్లే్‌షయాదవ్‌లు ఎమ్మెల్యేకు వివరించారు. సమస్య శాశ్వత పరిష్కరానికి తీసుకోవాల్సిన చర్యలపై తనకు నివేదిస్తే నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. 

Updated Date - 2021-07-25T06:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising