ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

634అడుగులకు చేరిన మూసీ నీటిమట్టం

ABN, First Publish Date - 2021-06-14T06:33:39+05:30

మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 634అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో వచ్చిన వరదతో ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వస్తోంది.

నీటితో కళకళలాడుతున్న మూసీ రిజర్వాయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 634అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో వచ్చిన వరదతో ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వస్తోంది. 645అడుగుల పూర్తిస్థాయి సామ ర్థ్యం గల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలకడగా కొనసాగుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 634.4అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి 600క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
 మూసీ గేట్లకు గ్రీసింగ్‌, ఆయిలింగ్‌
వర్షాకాల సీజన్‌ ప్రార ంభమవడం, ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యం లో డ్యాం యంత్రాంగం మూసీ ప్రాజెక్టు గేట్ల నిర్వహణపై దృష్టి పెట్టింది. వరదలు వచ్చిన సమయంలో గేట్లు ఎత్తడం, దించడం సులభంగా ఉండేందుకు ప్రాజెక్టు క్రస్టు, రెగ్యులేటరీ గేట్లకు ఏటా గ్రీసు, ఆయిల్‌ రాస్తుంటారు. ఈ ఏడాది సైతం గేట్ల నిర్వహణ పనులు రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. 
నిలకడగా డిండి రిజర్వాయర్‌ నీటిమట్టం
డిండి :
డిండి రిజర్వాయర్‌ ఆదివారం సాయంత్రానికి 32 అడుగులు(2టీఎంసీలు) గరిష్ఠస్థాయిలో ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగులుకాగా ప్రస్తుతం 32 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇనఫ్లో ప్రాజెక్టులోకి రావడంలేదు.
సాగర్‌ నీటిమట్టం 532.90అడుగులు
నాగార్జునసాగర్‌, జూన 13 : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 532.90అడుగులుగా ఉంది. నాలుగు రోజుల క్రితం సాగర్‌ ప్రాజెక్టు 533.10 అడుగుల నీటిమట్టం ఉండగా ఎస్‌ఎల్‌బీసీకి 1000 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తుండ టంతో ప్రస్తుతం 532.90 అడుగులుగా నమోదైంది. కుడి, ఎడమ కాల్వలు, ప్రధాన జలవిద్యుత కేంద్రానికి ఎటువంటి నీటి విడుదల లేదు.

Updated Date - 2021-06-14T06:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising