ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు పితృవియోగం
ABN, First Publish Date - 2021-12-18T06:52:21+05:30
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు పితృవియోగం కలిగింది.
నల్లగొండ, డిసెంబరు 17: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, రిటైర్డ్ టీచర్ గాదరి మారయ్య(73) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మారయ్య మృతికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ సమయంలో మనోధైర్యంతో ఉండాలని మంత్రి అన్నారు. తండ్రి అంత్యక్రియలు నల్లగొండ పట్టణంలో శనివారం మధ్యాహ్నం సుమారు 12గంటలకు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ తెలిపారు.
Updated Date - 2021-12-18T06:52:21+05:30 IST