ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2021-11-09T06:37:07+05:30

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

మురికి కాలువలోకి వంగిన బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మురుగు కాల్వలోకి దిగిబడిన బస్సు.. విద్యార్థులు క్షేమం

యాదాద్రిరూరల్‌, నవంబరు 8: ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీబీనగర్‌లోని ఓ ప్రై వేట్‌ పాఠశాలకు చెందిన బస్సు 15 మంది విద్యార్థులతో బయలుదేరింది. స్థానిక సంత(అంగడి) ప్రాంతంలోని రోడ్డు నుంచి వస్తున్న క్రమంలో  మూలమలుపు వద్ద తిరుగుతుండగా ప్రమాదవశాత్తు మురుగుకాల్వలో వెనుక టైరు దిగబడింది. దీంతో బస్సు ఒక వైపునకు ఒరిగింది. బస్సులో ని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ విద్యార్థులను వెంట నే కిందికి దింపాడు. ఒరిగిన పక్కనే విద్యుత స్తంభం ఉంది. ఒక వేళ దా నికి తాకితే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సును ఎ క్సకవేటర్‌ సహాయంతో బయటికి తీసి, అదే బస్సులో విద్యార్థులను పాఠశాలకు తరలించారు. రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతోనే ప్రమా దం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. 


Updated Date - 2021-11-09T06:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising