ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి అద్భుత కళాఖండం: Talasani

ABN, First Publish Date - 2021-08-14T19:09:24+05:30

యాదాద్రి అద్భుత కళాఖండమని... తిరుపతి దేవాలయంలా యాదాద్రిలో ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి-భువనగిరి: యాదాద్రి అద్భుత కళాఖండమని... తిరుపతి దేవాలయంలా యాదాద్రిలో ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం యాదాద్రి హరిత వనంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో గుడి నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు భక్తులు యాదాద్రికి వస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ ఉపఎన్నికలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామాని ధీమా వ్యక్తం చేశారు. యువకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నది టీఆర్‌ఎస్ మాత్రమే అని చెప్పారు. వాసాలమర్రి మరికొన్ని రోజుల్లో అద్భుతమైన గ్రామం అవుతుందన్నారు. రైతు బంధు , రైతు బీమా పథకాల గురించి ఎవరైనా ఊహించారా? అని అన్నారు. గొర్ల పెంపకం రెండో విడత ప్రారంభం కానుందని తెలిపారు. ఓట్ల కోసం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కారుకు కారు, బైక్‌కు బైక్ ఇస్తా అన్నారు...ఏమైంది అని ప్రశ్నించారు. భక్తులకు కొత్త ప్రపోజల్ పెడుతున్నామన్న మంత్రి తలసాని...శబరిమల లాగా యాదాద్రి దేవాలయం నిర్మాణం తరువాత 40 రోజుల దీక్ష చేసుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. 

Updated Date - 2021-08-14T19:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising