ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రైతాంగంలో గందరగోళం సృష్టించే యత్నం: మంత్రి Jagadish

ABN, First Publish Date - 2021-11-12T19:33:22+05:30

తెలంగాణ రైతాంగంలో రాష్ట్ర బీజేపీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: తెలంగాణ రైతాంగంలో రాష్ట్ర బీజేపీ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గింజను కొని కేంద్రానికి ఇచ్చామని తెలిపారు. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం రా రైస్ మాత్రమే కొంటామని బాయిల్డ్ కొనమని చేతులెత్తేసిందన్నారు. తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో మెజార్టీగా బాయిల్డ్ రైస్ పండిస్తారని... రైతులు మోసపోకుండా ఉండాలనే ఇతర పంటలు వేయాలని చెప్పామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమమే రైతు కేంద్రంగా సాగిందన్నారు. బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా రైతుల కోసం యుద్ధం చేస్తానికైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు. ఏ రకం ధాన్యం ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుందో కేంద్రం చెప్పాలని మంత్రి జగదీష్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-12T19:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising