ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

ABN, First Publish Date - 2021-10-20T06:48:41+05:30

మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను భువనగిరిలో ముస్లింలు ఘనం గా నిర్వహించారు. జలీల్‌పుర మసీద్‌ కమిటీ ఆధ్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని చాటుతూ భక్తి ర్యాలీ నిర్వహించారు.

భువనగిరిలో ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన్‌, అక్టోబరు 19: మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను భువనగిరిలో ముస్లింలు ఘనం గా నిర్వహించారు. జలీల్‌పుర మసీద్‌ కమిటీ ఆధ్వర్యంలో మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని చాటుతూ భక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మతపెద్ద షేక్‌ మీరా మాట్లాడుతూ, మహ్మద్‌ ప్రవక్త ప్రపంచానికి ఇచ్చిన శాంతి సందేశాన్ని అందరూ పాటిస్తే సుఖసంతోషాలతో జీవించడం సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులను నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆధ్వర్యంలో పట్టణ ఇన్స్‌పెక్టర్‌ ఏ.సుధాకర్‌, రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు ఇస్రత్‌ జహాన్‌, ఎండి.ఇంతియాజ్‌ పంపిణీ చేశారు. మిలాదున్‌ నబీ సందర్భంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిసిపల్‌ చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, రైతుసమన్వయ సమి తి జిల్లా చెర్మన్‌ కొలుపుల అమరేందర్‌ పాల్గొని శుభాంకాక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో ముస్లిం పెద్దలు అమిన్‌ ఉల్‌హక్‌, షకీల్‌, అస్గర్‌, ఇష్రాద్‌, గఫార్‌, అమీరుద్దీన్‌, వలీబాబ, ఖాజం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising