ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ నుంచి ధాన్యం రాకుండా చర్యలు

ABN, First Publish Date - 2021-11-30T07:11:39+05:30

ఏపీ నుంచి ధాన్యం అక్రమంగా రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద రెవెన్యు, పోలీస్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.

ఏపీ నుంచి ధాన్యం తెస్తున్న రైతుతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి


కోదాడ రూరల్‌, నవంబరు 29: ఏపీ నుంచి ధాన్యం అక్రమంగా రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద రెవెన్యు, పోలీస్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రా నుంచి తెలంగాణలోకి ధాన్యం అక్రమంగా రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉన్నందున ఏపీ రాష్ట్రం నుంచి ధాన్యం సరఫరా నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రా ప్రాంతం నుంచి ధాన్యం లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను పరిశీలించి వెనక్కి పంపించారు. ఆంధ్రా ప్రాంతం రైతులు గ్రామం పేరు మార్చి తప్పుడు వే బిల్లును నమోదు చేసి రాష్ట్రంలో విక్రయించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, ఆంధ్రా నుంచి ధాన్యంతో వస్తున్న వాహనాలను పరిశీలించి వెనక్కు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్‌కుమార్‌, డీఎస్పీ రఘు, తహసీల్దార్‌ శ్రీనివాసశర్మ, సీఐ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-30T07:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising