ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి

ABN, First Publish Date - 2021-10-17T06:01:56+05:30

ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని 45వ వార్డులోని దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో మాట్లాడారు. పండుగలను వేడుకలా నిర్వహించుకునే చ

సూర్యాపేటలో అమ్మవారి విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 16 : ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని 45వ వార్డులోని దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో మాట్లాడారు. పండుగలను వేడుకలా నిర్వహించుకునే చరిత్ర తెలంగాణ ప్రజలకే సొంతమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కౌన్సిలర్‌ గండూరి పావనికృపాకర్‌, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు. 

నాగారం: మండల పరిధిలోని ఫణిగిరి, వర్ధమానుకోట, మాచిరెడ్డిపల్లె గ్రామాల్లో దుర్గామాత ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. మాచిరెడ్డిపల్లె గ్రామంలో గుండ్ల మహేష్‌ -స్వప్న దంపతులు అమ్మవారి చీరను రూ.47,116లకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బోయిని శోభలింగమల్లు, పసుపులేటి ప్రేమలతావెంకట్‌రెడ్డి, గట్టు నర్సింహారావు, ఎంపీటీసీ వడ్డె పరశురాములు, ఈరేటి స్వప్నఅంజి, ఈదుల కిరణ్‌కుమార్‌, గుమ్మడోజు కార్తీక్‌ పాల్గొన్నారు. 

హుజూర్‌నగర్‌ : పట్టణంలోని కనకదుర్గ దేవాలయంలో విజయదశమి సందర్భంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్‌ ప్రసాద్‌, సుధాకర్‌, రామకృష్ణ, నర్సింహాచార్యులు, కొండయ్య, కొట్టు రాము, సురేష్‌, ఫణి, గిరిబాబు, చంద్రశేఖర్‌, కేవీఎన్‌మూర్తి పాల్గొన్నారు. 

అనంతగిరి: మండలంలో దుర్గాదేవి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

మునగాల రూరల్‌: మండలంలోని తాడువాయిలో దర్గాదేవి శోభాయా త్ర ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లోడంగి సంజయ్‌ కుమార్‌, వైస్‌ ఎంపీపీ కొలిశెట్టి  బుచ్చి పాపయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్‌ ఉపేందర్‌, కోల ఆంజనేయులు, చిర్ర సైదులు, గట్టు వెంకటేశ్వర్లు, కోళ్ల శ్రీరాములు, దేశగాని పాపయ్య పాల్గొన్నారు. 

కోదాడటౌన్‌: కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నయానగర్‌, భవానినగర్‌, గణేష్‌నగర్‌లో బాణసంచాలు, డబ్బు,చప్పుల నడుమ, పట్టణంలోని ఊరేగింపు నిర్వహించారు. అనంతనం అమ్మవారి విగ్రహలను పెద్ద చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో రమానిరంజన్‌రెడ్డి, బ్రహ్మం, వైడిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising