ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-09-17T06:23:15+05:30

భూతగాదాలతో ఓ వ్యక్తి హతమయ్యాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హోమంతాలపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.

అంజయ్య (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, సెప్టెంబరు 16: భూతగాదాలతో ఓ వ్యక్తి హతమయ్యాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హోమంతాలపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. నాంపల్లి సీఐ గుమ్మడిదల సత్యం తెలిపిన వివరాల ప్రకారం.. హోమంతాలపల్లి గ్రామానికి చెందిన కొలుకులపల్లి అంజయ్య(54) రెండు న్నర దశాబ్దాలుగా దేవరకొండ పట్టణంలో ఇస్ర్తీ డబ్బా నడుపుతూ  జీవిస్తున్నాడు.  స్వగ్రామంలో హోమంతాలపలిలో అంజయ్యకు పాలెవాళ్లతో భూతగాదాలు ఉన్నాయి. ఏడాది క్రితం పోలీసు కేసు అయింది. ఈ క్రమం లో ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో అంజయ్య గురు వారం సాయంత్రం ఓ కార్యక్రమానికి  వెళ్లగా పాలెవాళ్లతో అక్కడ వివాదం జరిగి  ఘర్షణకు దారిదీసింది.  అంజయ్య పాలెవాళ్లైన కొలుకుల పల్లి లింగం, లింగ బావ తాండ్ర లింగం, మరో ఇద్దరు మహిళలు అంజ య్యపై దాడి చేశారు.  కొలుకుపల్లి లింగం, తాండ్ర లింగంలు  అంజయ్య చాతిపై కత్తులతో  పొడిచారు. తీవ్ర రక్తస్రావమైన అంజయ్యను స్థానికులు దేవరకొండ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంజయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంజయ్య మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే  

అంజయ్య కుటుంబ సభ్యులను దేవరకొండ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రమా వత్‌ రవీంద్రకుమార్‌ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంజయ్యను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చింతపల్లి ఎస్‌ఐ, నాంపల్లి సీఐలను ఎమ్మెల్యే ఆదేశించారు. 

 



Updated Date - 2021-09-17T06:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising