ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం

ABN, First Publish Date - 2021-06-19T06:57:30+05:30

ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ 

చౌటుప్పల్‌ టౌన్‌, జూన్‌ 18:  ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.  చౌటుప్పల్‌ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములతో సీఎం కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలకు అవసరమైన పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించాల్సిన ప్రభుత్వ భూములను వేలంలో అమ్మి ఖజానా నింపుకోవాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. రాష్ట్రంలో 33వేల ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేయాలని ప్రభుత్వం చూస్తోందని, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వా లు ఇదే విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రంలో ప్రభుత్వ భూమి గుంట కూడా మిగలదని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను వేలం వేసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని,  లేనిపక్షంలో పరిణా మాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. పేద విద్యా ర్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు అందజేయాలని ప్రభుత్వా నికి అనేకమార్లు  విన్నవించినా పట్టించుకోలేదని, అదే అధికారులకు కోట్లాది రూపాయలను వెచ్చించి కియా కార్లను కొనుగోలు చేసి ఇచ్చిం దని ఆయన ఎద్దేవా చేశారు.  సమావేశంలో బీసీ సంఘం నాయకులు బి.రాజు, శ్రీధర్‌, రవి, వెంకటేశ్‌, వెంకన్నగౌడ్‌, కార్తీక్‌, మహిపాల్‌, నాగరాజు, రామచంద్రం పాల్గొన్నారు.                



Updated Date - 2021-06-19T06:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising