ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి : నర్సిరెడ్డి

ABN, First Publish Date - 2021-01-24T06:05:31+05:30

వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుకు రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.

బహిరంగ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నల్లగొండ రూరల్‌ / కనగల్‌ / నార్కట్‌పల్లి /  గుర్రంపోడు, జనవరి 23 : వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుకు రైతులు, కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. కార్మిక కర్షక పోరు యాత్ర శనివారం జిల్లాకేంద్రానికి చేరిం ది. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో నర్సిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, సా మాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక, కర్షక పోరుయాత్ర కనగల్‌లో కొనసాగింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ మాట్లాడుతూ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దు, కంపెనీల్లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో నార్కట్‌పల్లి మండలంలోని ఏపీలింగోటం సమీపంలోని యూ ఎ్‌సటీపీఎల్‌ కంపెనీ ఎదుట సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నాయ కులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్మిక కర్షక పోరు యాత్ర గుర్రంపోడులో సైతం కొనసాగింది.

Updated Date - 2021-01-24T06:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising