ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమానికి పెద్దపీట: విప్‌ సునీత

ABN, First Publish Date - 2021-01-19T06:16:51+05:30

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు.

వాసాలమర్రిలో మాట్లాడుతున్న సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుర్కపల్లి/ (బొ మ్మలరామారం) జనవరి 18: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు. తుర్క పల్లి మండలంలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో జిల్లా వ్యవసాయశాఖ, ఆత్మ యాదగిరిగుట్ట ఆధ్వర్యంలో రైతులకు విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణపై సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన మెళకువలు, రైతుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ శిక్షణ దొహాదపడుతుంన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడి,్డ సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ దానావతు బీకునాయక్‌, ఆత్మ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఆర్‌ఎ్‌సఎస్‌ జిల్లా కన్వీనర్‌ కొల్పుల అమరేందర్‌, ఎంపీపీ భూక్య సుశీలరవీందర్‌నాయక్‌ పాల్గొన్నారు. బొమ్మలరామారం మండలంలోని కాండ్లకుంట తండలో  పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్‌ సునీత ప్రారంభించారు. చీకటి మామిడి నుంచి కంచల్‌తండ కోటి15 లతో చేపట్టనున్న బీటి రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ  సుధీర్‌రెడ్డి, ఎంపీడీవో సరిత, పీఎసీఎస్‌ చైర్మన్‌ బాల్‌నర్సింహ, వైస్‌ ఎంపీపీ శోభచంద్రమౌళి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T06:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising