ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని అగ్ర భాగంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దే

ABN, First Publish Date - 2021-10-28T06:15:06+05:30

అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆగ్ర భాగంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దే విద్యుత్‌ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి):   అభివృద్ధిలో  రాష్ట్రాన్ని ఆగ్ర భాగంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దే విద్యుత్‌ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో బుధవారం నిర్వహించిన  నియోజకవర్గ విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిం దన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న దళితబంధు, కళ్యాణలక్ష్మి వంటి  పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.  దళిత బంధు పథకంతో దారిద్య్ర రేఖ నుంచి పేదలకే బయటికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ప్రతి పక్షాలు సీఎం కేసీఆర్‌ను విమర్శించడాన్ని ఖండిం చారు. ప్రతిపక్ష నాయకులు సీఎం కేసీఆర్‌ కాలిగోటికి కూడా సరిపో రన్నారు. 

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే 

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2014 సంవత్సరానికి ముందు భువనగిరిలో నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా అయ్యేవని, ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదన్నారు.  మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి నిత్యం మంచినీరు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుంద న్నారు.  వరంగల్‌లో జరిగే నవంబరు  15న నిర్వహించే ద్విదశాబ్ది విజ యోత్సవ సభను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.  ఈ సమా వేశంలో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, జిల్లా రైతుబంధు చైర్మన్‌ కొలుపుల అమరేందర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఏనబోయిన ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్‌ నల్లమాస రమేష్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, శెట్టి బాలయ్యయాదవ్‌, నాగారం అంజయ్య,  ఏవీ .కిరణ్‌కుమార్‌, జనగాం పాండు, తుమ్మల వెంకట్‌రెడ్డి, రాచమల్ల శ్రీనివాస్‌, పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T06:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising