కనుల పండువగా శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం
ABN, First Publish Date - 2021-06-25T06:39:50+05:30
మండలంలోని వేంకటాపురం గ్రామంలో శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీవేంక టేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణాన్ని గురువారం కన్నులపండువగా నిర్వహించారు.
వలిగొండ, జూన్ 24: మండలంలోని వేంకటాపురం గ్రామంలో శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ దేవాలయం శ్రీవేంక టేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణాన్ని గురువారం కన్నులపండువగా నిర్వహించారు. యజ్ఞా చార్యులు ప్రతాపురం మత్స్యగిరిస్వామి పర్యవేక్షణలో నిర్వహించిన కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనం తరం భక్తులు స్వామివారికి వడిబియ్యం సమర్పించారు. కార్యక్ర మంలో ఆలయ ఈవో రవికుమార్ ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి, ఎంపీపీ నూతి రమేష్‌రాజు, సర్పంచ్ కొత్త నర్సింహ, ఎంపీటీసీ రాంరెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా చెన్నకేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
రామన్నపేట: రామన్నపేట చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి కల్యాణ మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు లవణం ఉపేందర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-06-25T06:39:50+05:30 IST