ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ వెనుకబాటుకు జానారెడ్డే కారణం

ABN, First Publish Date - 2021-04-14T06:28:32+05:30

నాగార్జునసాగర్‌ నియోజకవర్గం వెనుకబాటుకు జానారెడ్డే కారణమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

కొత్తపల్లిలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి 


హాలియా, ఏప్రిల్‌ 13: నాగార్జునసాగర్‌ నియోజకవర్గం వెనుకబాటుకు జానారెడ్డే కారణమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. అనుముల మండలంలోని కొత్తపల్లిలో మంగళవా రం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి భగత్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఐదు దశాబ్దాల కాలంలో సాగర్‌ ఎడమ కాల్వ కింద 70వేల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే అన్నా రు. అందులో 35ఏళ్లు శాసనసభ్యుడిగా, 14 ఏళ్లు మంత్రిగా అధికా రం చలాయించింది కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి కాదా అని ప్రశ్నించా రు. అటువంటి అభ్యర్థి నిజస్వరూపం గమనించిన ప్రజలు 2018 లోనే ఆయన్ను తిరస్కరించారని గుర్తు చేశారు. అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రాకుండా జానారెడ్డి తోకముడిచారని అన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో మొదటి మేజర్‌ రాజవరానికి నీళ్లు ఇవ్వడంతో పాటు, నెల్లికల్లు రైతుల దశాబ్దల కలను సాకారం చేసేందుకు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా శంకుస్థాపన చేశారన్నా రు. కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే భగత్‌ గెలుపునకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాయకులు విజయేందర్‌రెడ్డి, పెద్దులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T06:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising