ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో సీసీరోడ్లు ధ్వంసం సరికాదు

ABN, First Publish Date - 2021-04-21T05:58:32+05:30

టీపైబర్‌ పేరుతో గ్రామాల్లో సీసీరోడ్లను ధ్వంసం చేయడం సరికాదని కల్లూరు, చిల్లేపల్లి సర్పంచులు పల్లెపంగ నాగరాజు, కొడిద మనోజ్‌కుమార్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ జ్యోతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, ఏప్రిల్‌ 20: టీపైబర్‌ పేరుతో గ్రామాల్లో సీసీరోడ్లను ధ్వంసం చేయడం సరికాదని కల్లూరు, చిల్లేపల్లి సర్పంచులు పల్లెపంగ నాగరాజు, కొడిద మనోజ్‌కుమార్‌ అన్నారు. ఎంపీపీ లకుమళ్ల జ్యోతి అధ్యక్షతన  ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. గ్రా మాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి సీసీరోడ్లు నిర్మిస్తే వాటిని ఫైబర్‌ నిర్మాణాలు, మిషన్‌ భగీరథ పైపులైన్ల కోసం ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. స్పందించిన ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. అంగన్‌వాడీ టీచర్‌ విధులకు హాజరుకావడం లేదని, ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని చిల్లేపల్లి సర్పంచ్‌ మనోజ్‌కుమార్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ఎంపీడీవో తెలిపారు. దాచారం ఊర చెర్వు ఆక్రమణకు గురవుతుందని సర్వేచేయించి హద్దులు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ సుశీల కోరారు. అధికారుల గైర్హాజర్‌పై ఎంపీపీ జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-21T05:58:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising