వరి సాగు చేయొద్దనడం సరికాదు
ABN, First Publish Date - 2021-10-29T06:17:01+05:30
యాసంగిలో వరి సాగుచేయొద్దని రైతులను ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు.
సూర్యాపేట కల్చరల్, అక్టోబరు 28: యాసంగిలో వరి సాగుచేయొద్దని రైతులను ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్‌లో గురువారం నిర్వహించిన సీపీఎం సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో సగభాగం ఎస్సా రెస్పీ, నాగార్జునసాగర్ కాల్వల ద్వారా, సూర్యాపేట నియోజకవర్గంలోని రెండు మండలాల్లో మూసీ ప్రాజెక్టు నీటి ద్వారా ఎక్కువగా వరి సాగవు తోందన్నారు. 80 శాతం మంది రైతులు వరిపై ఆధారపడి జీవిస్తున్నారని, ఆ భూములు ప్రత్యామ్నాయ పంటలకు అనుకూలంగా లేవన్నారు. వరి సాగు వద్దంటే కోట్ల రూపాయలతో నీటి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించారని ఆయన ప్రశ్నించారు. యాసంగిలో వరి సాగుచేయొద్దని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పడం దారుణమని, వెంటనే మంత్రి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయన్నారు. కోటి ఏకరాలకు నీరు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూనే వరిని సాగు చేయొద్దనడం విడ్డూరంగా ఉందన్నారు. వరి సాగుచేయొద్దన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటను ఉపసంహరించు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, ఎల్గూరి గోవింద్‌పాల్గొన్నార
Updated Date - 2021-10-29T06:17:01+05:30 IST