ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటుచేయాలి

ABN, First Publish Date - 2021-05-18T07:03:06+05:30

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో కొవిడ్‌ బాధితులకోసం ఐసోలేషన్‌వార్డులు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌చేశారు.

పోచంపల్లిలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భూదాన్‌పోచంపల్లి/ మోత్కూరు, మే 17: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో కొవిడ్‌ బాధితులకోసం ఐసోలేషన్‌వార్డులు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌చేశారు. భూదాన్‌పోచంపల్లిలో సీపీఎం నాయకులు ప్లకార్డులు ప్రదర్శించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి పగిల్ల లింగారెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజలపై పంజా విసురుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా యని అన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో 170మంది డాక్టర్లు ఉన్నా కొవిడ్‌ ఇన్‌పేషెంట్‌ విభాగం ఏర్పాటు చేయకపోవడం విచారకర మన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు.కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కోట రాంచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు, పగడాల శివ, దుబ్బాక జగన్‌, శివ, అనిల్‌  పాల్గొన్నారు. బీబీనగర్‌ ఏయిమ్స్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ రోగుల చికిత్స కోసం 500 పడకలు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్‌ చేశారు. మోత్కూరు మండలంలోన పాలడుగు గ్రామంలో ప్లకార్డులతో నిరసన దీక్ష చేసి మాట్లాడారు. లాక్‌డౌన్‌లో ప్రతి కుటుంబానికి రూ.7500 నగ దుతో పాటు 17 రకాల నిత్యావసర సరకులు అందించాలన్నారు. కార్యక్రమంలో దడిపెల్లి ప్రభాకర్‌, కొంపెల్లి గంగయ్య, చింతకింది సోమరాజు, అయిలయ్య, లక్ష్మి, నర్సమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T07:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising